![]() |
![]() |
.webp)
రిషి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూసే టైమ్ రానే వచ్చింది. గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులకు పండగ మొదలైందా.. అవును తాజాగా వదిలిన ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ లో గత కొన్ని రోజులుగా రిషి పాత్రని చూపించడం లేదు. ఆన్ స్క్రీన్ మీద రిషి, వసుధారల కోసం చూసే వాళ్ళే ఎక్కువ. రిషి అటిట్యూడ్.. వసుధార ఈగో.. రెండు కలిపి రిషీధారగా మారిన ప్రేమ.. ఈ సీరియల్ ని ఎంతో ఎత్తులో నిల్చోబెట్టాయి. అయితే కథలోకి కొత్త విలన్ రాజీవ్ వచ్చి వసుధారని కష్టాల్లో నెట్టడమే పనిగా పెట్టుకుంటే.. ఆ శైలేంద్ర ఎండీ సీటు కోసం గుంటనక్కలా కాపు కాస్కొని కూర్చున్నాడు. అయితే ఎప్పుడు రిషి వస్తాడా.. ఏసేద్దామా అనే పనిలో భద్ర, రాజీవ్, శైలేంద్ర ఎదురుచూస్తుంటే సడన్ గా మాయమయ్యాడు. అయితే మొన్నటి ఎపిసోడ్ లో.. కాలేజీ యూత్ ఫెస్టివల్ కి రిషీ వస్తున్నాడంటూ కాలేజీ స్టూడెంట్స్ తో సహా ఈ సీరియల్ అభిమానులు ఎదురుచూసారు. అయితే వారికి నిరాశే మిగిలింది. రిషిని తీసుకొస్తున్న చక్రపాణిని వెనుకాల నుండి ఎవరో వచ్చి కొట్టి తీసుకెళ్ళడం.. అది విని వసుధార కళ్ళు తిరిగి పడిపోవడం అంతా ఒక కలలా అయిపోయింది. అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది. అసలు రిషిని తీసుకెళ్ళింది ఎవరు? రిషి ఏమైపోయాడు? అసలు వస్తాడా రాడా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
గుప్పెడంత మనసు తాజా ప్రోమోలో.. ఇక ఆ రిషి నీ కోసం రాడని చెప్తూ వసుధారని రాజీవ్ లాక్కెళ్తుంటాడు. అప్పుడే అక్కడికి ఒకరు వచ్చి.. ఆ చేతిని వదులని చెప్తాడు. మరి అలా వచ్చింది రిషీనేనా లేక కొత్త క్యారెక్టరా? ఏది నిజమో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
![]() |
![]() |